కామారెడ్డి, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి వైద్యకళాశాల వస్తే ఈ ప్రాంత విద్యార్థులతో పాటు ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా ఉచితంగా లభిస్తాయని, మెడికల్ కళాశాల సాధనలో భాగంగా శనివారం టీఎన్ జివో జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి వైద్య కళాశాల కోసం చేస్తున్న పోరాటానికి టీఎన్ జివో ఉద్యోగ సంఘం మద్దతు తెలపాలని కోరారు.
కార్యక్రమంలో టీఎన్జీవో కార్యదర్శి సాయిలు, లక్ష్మణ్, సంతోష్ విద్యార్థి సంఘాల నాయకులు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, భరత్, కుంభాల లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.