నందిపేట్‌ మండలానికి ఫైర్‌స్టేషన్‌ మంజూరు

నందిపేట్‌, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండలానికి ప్రభుత్వం కొత్తగా ఫైర్‌స్టేషన్‌ మంజూరు చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా 15 నూతన ఫైర్‌ స్టేషన్‌లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కాగా నందిపేట్‌ మండల కేంద్రంలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి పలుసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసిన నూతన ఫైర్‌ స్టేషన్ల జాబితాలో నందిపేట్‌ మండల కేంద్రం కూడా ఉంది. నందిపేట్‌కు ఫైర్‌ స్టేషన్‌ మంజూరు కావడం పట్ల పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నందిపేట్‌ మండలంలో అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన ప్రజలకు సేవలు అందించడానికి ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటవుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన విన్నపాన్ని మన్నించి ఫైర్‌ స్టేషన్‌ మంజూరు చేసినందుకు నందిపేట్‌ మండల ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవన్‌ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »