నిజామాబాద్, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను అంశాలపై ఆ శాఖ అధికారులచే ఈ నెల 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ట్రెజరీ కార్యాలయం ఉప సంచాలకులు బి.కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా ట్రెజరీ కార్యాలయం పరిధిలోని సబ్ ట్రెజరీ అధికారులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, డీడీఓలు సకాలంలో వర్క్ షాప్లో పాల్గొనాలని కోరారు.