రెంజల్, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనఊరు మన ఎమ్మెల్యే రెండవ దఫా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని బొర్గం, తాడ్ బిలోలి, మౌలాలి తాండా గ్రామాలలో చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్ పాషా, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు హజీ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని పల్లెపల్లెకు వివరించేందుకు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షకీల్ చేపట్టడం జరిగిందని కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.