నిజాంసాగర్, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరంలాగా ఈ యేడు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగిన వీరభద్ర స్వామి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల నుండి కొనసాగిన మహోత్సవాలు మొదటి రోజు పసుపు పెట్టు కార్యక్రమం, పందిరి వేసుట, రెండవ రోజు భద్రకాళి సమేత వీరభద్ర కళ్యాణం అనంతరం అన్నదానం భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
అలాగే మూడవ రోజున ఉదయం అగ్నిగుండం, పల్లకి ఊరేగింపు తీర్థ ప్రసాదాలు దండకంలతో భక్తి చాటుకున్నారు. కార్యక్రమంలో గతంలో కంటే ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇలా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కళ్యాణోత్సవం కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని అన్న ప్రసాదంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సంగయప్ప, శివప్ప మాట్లాడుతూ అగ్నిగుండంలో నడిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకంతో భక్తిని చాటుకున్నారన్నారు. మంగళ హారతులతో భక్తి పాటలు, భజనలు గ్రామస్తుల సహకారంతో వీరభద్ర ఉత్సవాలు ఘనంగా చేశామని మున్ముందు కూడా మరింత ఘనంగా చేస్తామని పూజారులు తెలిపారు.