నిజామాబాద్, జూన్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శనివారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్, రాష్ట్ర వ్యవసాయ సెక్రేటరీ రఘునందన్ రావు “నకిలీ విత్తనాల నిరోధాలపై ” వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తన డీలర్లను, ప్రాసెసింగ్ సంస్థలను పరిశీలించేటప్పుడు సరిదిద్దగల, సరిది ద్ధలేని తప్పుల మద్య తేడాను గుర్తించాలని సరిదిద్దగల తప్పుల కోసం దాని సరిదిద్దడానికి ఒక అవకాశం ఇవ్వవచ్చు అని సరిదిద్దలేని పొరపాటు కోసం కేసులు బుక్ చేయాలని అలవాటు పడిన నేరస్థులపై పి.డి యాక్ట్ ఉపయోగించాలని అన్నారు.
సరిదిద్దగల తప్పులు ప్రముఖ స్థలంలో విత్తన లైసెన్సు ప్రదర్శించకపోవడం, స్టాక్ రిజిస్టర్‌ను నవీకరించకపోవడం మొదలగునవి.
సరిదిద్దలేని తప్పులు విత్తన లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించడం మొదలగునవి అని అన్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. గోవింద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు, అదనపు డి.సి.పి. ( లా అండ్ ఆర్డర్ ) జి. శ్రీనివాస్ కుమార్, అదనపు డి.సి.పి ( ఆపరేషన్స్ ) టి. స్వామీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారి వాజీద్ హుస్సెన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవెందర్, సి.ఐలు, మండల వ్యవసాయ అధికారులు సహాయ వ్యవసాయ సంచాలకు లు తదితరులు పాల్గొన్నారు.