ఆర్మూర్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని, అదేవిధంగా టిఆర్‌ఎస్ గుండాలచే హైదరాబాదులో ఉన్న అరవింద్ ధర్మపురి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేసి ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో హుందాగా ఉండవలసినటువంటి, మాట్లాడవలసినటువంటి ఎమ్మెల్సీ కవిత అసహ్యకరమైన పదజాలాన్ని వాడడం ఆమె గౌరవానికే అగౌరవాన్ని మూట కట్టినట్టుగా ఉందని, తెలంగాణ ప్రజలు బతుకమ్మగా పిలుస్తూ గౌరవించే కవితను నేడు మాట్లాడిన భాష, యాస అసంస్కారముగా, అభ్యంతరకరంగా ఉండడం తెలంగాణ ప్రజలకే కాదు తెలంగాణ ఆడపడుచులు సైతం సిగ్గుపడే పరిస్థితిని తీసుకురావడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలే తప్ప తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అని తాను ఏం చేసినా నడుస్తదన్న అహంభావంతో టిఆర్‌ఎస్ గుండాలచే హైదరాబాద్‌లోని ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేయించడం సిగ్గుచేటైన విషయమన్నారు. టిఆర్‌ఎస్ గుండాలచే దాడి చేయించిన వెంటనే పాత్రికేయుల సమావేశం నిర్వహించి వెర్రెక్కిన మధముల మాట్లాడి తన గౌరవాన్ని తానే విడుచుకున్నట్టుగా ఉందన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని గమనించిన సమాజం సైతం నివ్వెరపోతుందని, వెంటనే తెలంగాణ ప్రజలకు ప్రధానంగా తెలంగాణ ఆడపడుచులకు అదే విధంగా బిజెపికి, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌కి క్షమాపణలు చెప్పి కవిత వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకొని హుందాగా నడుచుకోవాలని లేనట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయడం ఖాయమని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు హితవు పలికారు.
కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బిజెపి, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.