కామారెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పీవీ నరసింహ రావు తెలంగాణా పశు వైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో ఈ నెల 21 న స్పాట్ ప్రవేశాలు ఉంటాయని అసోసియేట్ డీస్ ప్రొఫెసర్ శరత్ చంద్ర తెలిపారు. రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో స్పాట్ ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు.
కన్వీనర్ కోటాలో ప్రవేశము లభించని విద్యార్థులు, అదే విధంగా ఎంసెట్ పరీక్ష వ్రాసి క్వాలిఫై కాని విద్యార్థులకు ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుపుతామని తెలిపారు. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో 12 సీట్లు, వ్యవసాయదారుల కోటాలో 7 సీట్లు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు.
వ్యవసాయదారుల కోటాలో సీట్లు పొందగోరిన వారు పట్టేదారు పాసు పుస్తకంతో పాటు హాజరు కావాలని, ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు డైరీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. విదేశాలలో ఉన్నత విద్య అవకాశాలే కాకుండా, మంచి ఉద్యోగ అవకాశాలు కుడా ఉన్నాయని వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను, వారి తల్లి తండ్రులను కోరారు.