కామారెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 19వ తేదీ శనివారం కామారెడ్డి పట్టణం పట్టణంలోని కాకతీయ నగర్ సబ్స్టేషన్, హౌసింగ్ బోర్డ్ సబ్ స్టేషన్ పరిధిలో గల కాలనీలు, అలాగే నరసన్న పల్లి సబ్స్టేషన్, రాజంపేట సబ్స్టేషన్, చిన్న మల్లారెడ్డి సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలకు విద్యుత్ మరమత్తుల కారణంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కామారెడ్డి డివిజనల్ ఇంజనీర్ సాలియ నాయక్ తెలిపారు.
కావున వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు.