కామారెడ్డి, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియను, ట్యాబ్ ఎంట్రీని, రికార్డులను పరీక్షించి సంతృప్తి వ్యక్తపరచారు. ట్యాబ్ ఎంట్రీ ఇంకా వేగవంతం చేయాలని సీఈఓ ను ఆదేశించారు. కౌలు రైతులకు సంబంధించి ఓటిపిలను తొందర తొందరగా అయ్యేటట్టు చూడాలని ఏఈఓని ఆదేశించారు.
రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి ప్రతినిత్యం అధికారులతో సంప్రదింపులు జరుపుతాడని, ప్రతి సమస్యను తమ దృష్టికి తీసుకొస్తాడని రైతులకు ఏ కష్టం జరిగిన తన కష్టంగా భావిస్తాడని అన్నారు. కార్యక్రమంలో డిసిఓ వసంత, ఏఎస్‌ఓ వెంకట్, మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, పద్మాజి వాడి సొసైటీ చైర్మన్ గంగాధర్, సీఈఓ బైరయ్య, సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.