కామారెడ్డి, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాదు ఎంపీ అరవింద్ దిష్టి బొమ్మ ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అరవింద్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చిట్టీమల్ల అనంత రాములు మాట్లాడుతూ కవితపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ధర్మపురి అరవింద్, బీజేపీ నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
కవిత వెంట యావత్తు తెలంగాణ అండగా ఉంటుందని అన్నారు. తమ నాయకురాలి పట్ల అసందర్భ, అనాలోచిత, నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కవిత అభిమానులుగా బీజేపీ నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని అన్నారు. అనంతరం స్థానిక నిజాంసాగర్ చౌరస్తా వద్ద అరవింద్, బీజేపీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా జాగృతి నాయకులు ఆవునూరి రమణా రావు, కులకర్ణి చక్రధర్, కామటి శేఖర్, స్వామి గౌడ్, సత్యనారాయణ, సంగాగౌడ్, చింతల రవి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.