తెలంగాణ వచ్చాకే మండలాల అభివృద్ధి

నందిపేట్‌, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవనరెడ్డి అన్నారు. డొంకేశ్వర్‌ మండల ఏర్పాటుతో చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్ముర్‌ నియోజక వర్గంలోని అలూరు, డొంకేశ్వర్‌లను నూతన మండలాలుగా ఏర్పాటు చేయగా గత నెలలో ఆలూరులో మండల కార్యాలయన్ని ప్రారంభించినప్పటికి డొంకేశ్వర్‌లో అనివార్య కారణాల వల్ల వాయిదపడిరది, అయితే ఆర్మూర్‌ ఎంఎల్‌ఏ జీవన్‌ రెడ్డి చేతులమీదుగా ఆదివారం అధికారికంగా నూతన మండల కార్యాలయ ప్రారంభోత్సవం కన్నుల పండువగ జరిగింది.

నూతన మండల కేంద్రం అయిన డొంకేశ్వర్‌ గ్రామానికి ఆదివారం చేరుకున్న ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నికాల్పూర్‌ కమాన్‌ నుండి యువకులు బైక్‌ ర్యాలీ తీశారు. ప్రజలు పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్‌ కార్యాలయ సిబ్బందితో కలిసి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

నూతన తహసీల్దార్‌ రవీందర్‌ నాయక్‌ను ఆయన కుర్చీలో కూర్చోబెట్టి కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సత్య గంగవ్వ కల్యాణ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రసంగించారు. ప్రతి ఇంటి సంక్షేమము, ప్రతి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. గుజరాత్‌ మోడల్‌ కావాలా, తెలంగాణ మోడల్‌ కావాలా అని అక్కడున్న ప్రజలను అడుగగా కేసీఆర్‌ తెలంగాణ మెడల్‌ కావాలని సభలోని ప్రజలందరూ చేతులెత్తి సంఫీుబావం తెలిపారు.

అంతకు ముందు మాట్లాడిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు ప్రజల అభ్యర్థన మేరకు మండలం ఇచ్చిన సిఎం కెసిఆర్‌, ఎంఎల్‌సి కవిత, ఎంఎల్‌ఏ జీవన్‌ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌, నందిపేట తాసిల్దార్‌ అనిల్‌ కుమార్‌, డొంకేశ్వర్‌ తహసిల్దార్‌ రవీందర్‌ నాయక్‌, జడ్పిటిసి ఎర్రం యమున ముత్యం, ఎంపీపీ వాకిడి సంతోష్‌, డొంకేశ్వర్‌ సర్పంచ్‌ ఛాయ చందు, ఎంపిటిసి శ్రీకాంత్‌, కో ఆప్షన్‌ సయ్యద్‌ హుస్సేన్‌, సొసైటీ చైర్మన్‌ భరత్‌ రెడ్డి, టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మచర్ల సాగర్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్‌లు, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు వెల్మల్‌ రాజన్న, శ్రీనివాస్‌ గౌడ్‌, దశ గౌడ్‌, బాలగంగాధర్‌, హుస్నోద్దీన్‌, పాషా, సంజీవ్‌, పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »