భీమ్‌గల్, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణం కేంద్రంలోని బాబాపూర్‌కి చెందిన సోమా శ్రావ్య (తెలంగాణలో 73, అల్ ఇండియాలో 1,369) అలాగే బచన్-పల్లి కి చెందిన సుమయ్యా మహిక్ (తెలంగాణ 3076, అల్ ఇండియాలో 1,21,822) ర్యాంక్ సాధించి శ్రావ్య అనే అమ్మాయి హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్‌లో, సుమయ్యా అనే అమ్మాయి అయాన్ మెడికల్ కాలేజ్‌లో సీటు దక్కించుకున్నారు.
మధ్య తరగతి కుటుంబంలో జీవనం కొనసాగిస్తూ ఇలాంటి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఇద్దరు యువతులని ఆదివారం పట్టణ కేంద్రాణికి చెందిన న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరుపున ఆహ్వానించి వారికి స్థానిక ఎస్‌ఐ రాజ్ భారత్‌తో, యూత్ సభ్యులు కలిసి స్థానిక మహిళ గిరిజన వసతి గృహంలో పులమాల, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో ఆడవారు కూడా మగవారితో సమానంగా పోటీ పడాలని సూచించారు. అలాగే యూత్ అధ్యక్షుడు రావుట్ల అరవింద్ మాట్లాడుతూ మన పట్టణం నుండి ఇలాంటి ప్రతిభావంతులు మరింత మంది రావాలని హాస్టల్ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు పర్స సుశాంత్, బట్టు హరీష్, గూడస్ సంజయ్, బాలికల వసతి గృహం వార్డెన్ నవనీత, అమ్మాయి తండ్రి సోము రవి, సుమయ్యా తల్లి జినాథ్ పర్వీన్, బాలికల వసతి గృహం విద్యార్థులు పాల్గొన్నారు.