కామారెడ్డి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వరంలో ఈనెల 23వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 వరకు జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంచార్జ్ మహిళ, శిశు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని రమ్య తెలిపారు.
అంధులు, శారీరక వికలాంగులు, బధిరులకు, మానసిక వైకల్యం గల దివ్యాంగులు జూనియర్స్ (10 సంవత్సరాల నుండి 17సంవత్సరాల లోపు బాలురు, బాలికలకు (సీనియర్స్ ), (17సంవత్సరాల నుండి 54 సంవత్సరాల లోపు మహిళలు, పురుషులకు) వేరువేరుగా (పరుగు పందెములు, షాట్ పుట్, ట్రై సైకిల్ రేస్, జవేలిన్ త్రో, చెస్, క్యారం) ఆటల పోటీలు నిర్వహించబడుతాయన్నారు.
ఆసక్తి గల అంధులు, శారీరక వికలాంగులు, బధిరులకు, మానసిక వైకల్యం గల వారు జిల్లా స్థాయి క్రీడలలో పాల్గొనుటకు 23న ఇందిరా గాంధీ స్టేడియం మైదానం కామారెడ్డిలో ఉదయం 9 గంటలలోపు హాజరై పేర్లు నమోదు చేసుకొని ఆటల పోటిలలో పాల్గొనాలని కోరారు. క్రీడలలో పాల్గొనువారు తమ వెంట ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్ జిరాక్స్ తప్పనిసరిగా తీసుకొని రావాలన్నారు.
క్రీడలలో ఎంపికైన మొదటి విజేతలను హైదరాబాద్‌లో జరుగు రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడల కోసం ఎంపిక చేస్తామని చెప్పారు. విజేతలకు డిసెంబరు 3న జరుగు జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకల కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. జిల్లాలోని దివ్యాంగులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.