కామారెడ్డి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపలలో పోషక విలువలు అధికంగా ఉంటాయని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్స్య సంపద ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా మత్స్య శాఖ అధికారి వరద రెడ్డి మాట్లాడారు. చేపల రకాలు, వాటిని పెంచే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.