కామరెడ్డి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్లో డాక్టర్ పిప్పిరి సాయికుమార్ ఎంబీబీఎస్, డాక్టర్ ఐ వినాయక్ ఎంసీహెచ్, యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
ఒక్కో పేషంట్‌కు సుమారు వేల విలువగల వివిధ రక్త, గుండె, లివర్, కిడ్ని, ఈసిజి పరీక్షలను ఉంచితంగా చేశారు. సుమారు 150 మందికి సేవలను అందించినట్లు శ్రీ కృష్ణ యూరో, కిడ్నీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అర్వా నరేందర్ రాజు తెలిపారు. పరీక్షలతో పాటు డాక్టర్ కన్సల్టేషన్ ఫిజును సైతం ఉచితంగానే అందించామన్నారు.