కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు కోసం రేపు బుధవారం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవల్ అధికారుల వద్ద అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ ఓటర్ల నమోదుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
2023, జనవరి ఒకటి నాటికి 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. రాజకీయ పార్టీల వారు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని ఓటర్ల నమోదు తమ వంతు సహకారం అందించాలని పేర్కొన్నారు.
ఫామ్ 6,7,8 దరఖాస్తులు బూత్ లెవల్ అధికారుల వద్ద ఉంచుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, శీను, రాజా గౌడ్, ఏవో రవీందర్, తాసిల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.