కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు యూనిట్లను మంగళవారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. సదాశివనగర్ మండలం పద్మాజి వాడి చౌరస్తాలో ఉన్న పెద్ద బూరి చరణ్ తేజకు చెందిన టెంట్ హౌస్ పరిశీలించారు. పొందుతున్న ఆదాయం వివరాలను అరా తీశారు.
బిక్నూర్ మండలం సిద్ది రామేశ్వర నగర్ లో పిండి వంటలు తయారు చేసే యూనిట్, ఆటోను పరిశీలించారు. యూనిట్ ద్వారా ఎనిమిది మందికి ఉపాధి కలుగుతుందని లబ్ధిదారుడు తెలిపారు. బస్వాపూర్‌లో సెంట్రింగ్ యూనిట్‌ను సందర్శించారు. ప్రతినెల పొందుతున్న ఆదాయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా పరిపుష్టిని సాధిస్తున్నారని జనరల్ మేనేజర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, అధికారులు పాల్గొన్నారు.