నిజామాబాద్, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర నడిబొడ్డున గల మహిళా కళాశాల భూములపై నేతల కన్ను పడిరది. కళాశాల భూములు ఆక్రమణకు గురికావడంతో విద్యార్థులు కళాశాల భూములను కాపాడాలని కదం తొక్కారు. కళాశాల విద్యార్థులు రోడ్డేక్కి బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మహిళా కళాశాల భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్‌ను కళాశాల ప్రిన్సిపల్ భారతి సంప్రదించి తమకు ఎవరు న్యాయం చేయడం లేదని, కనీసం మీరైనా తమకు న్యాయం చేయాలని కోరారు.
దీంతో మంగళవారం కార్పొరేటర్ గడుగు రోహిత్, కళాశాల ప్రిన్సిపాల్ భారతి ఆధ్వర్యంలో విద్యార్థినిలు ఆందోళన బాట పట్టారు. జిల్లా కేంద్రంలో మహిళా కళాశాల సమీపంలోని కంఠేశ్వర్ చౌరస్తా వద్ద మంగళవారం విద్యార్థినిలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గడుగు రోహిత్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉమెన్స్ కళాశాల ఆస్తులపై కబ్జాదారుల కన్ను పడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థినిలకు మహిళా కళాశాల సొసైటీ ఆధ్వర్యంలో తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందిస్తున్న విద్యాసంస్థ భుములు కబ్జా చేసేందుకు యత్నించడం దారుణమన్నారు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన మహిళా కళాశాల ఆధీనంలోని భూములను కబ్జాదారులు కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేస్తే జిల్లా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. మహిళా కళాశాల భూముల కబ్జా వెనుక లీడర్లు, బడా వ్యాపారవేత్తలు ఉన్నారన్నారు. మహిళలకు ఉన్నత విద్యను అందించే కళాశాల భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం హామీ ఇవ్వాలని విద్యార్థినిలు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆర్మూర్ రోడ్‌లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిరది.
నిజామాబాద్ నుండి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ప్రస్తుతం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు మాధవ్ నగర్‌లో జరగడంతో హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు కూడా కంఠేశ్వర్ మార్గం గుండా బైపాస్ నుండి వెళ్లాలి, సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించడంతో కంఠేశ్వర్ నుండి సుమారు రైల్వే కమాన్ వరకు వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. స్పందించిన మూడో టౌన్ ఎస్‌ఐ ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఎక్కడికక్కడ వాహనాల మళ్లింపు చేశారు.
స్థానిక పోలీసు అధికారులు కలగజేసుకుని సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పినా వినకుండా రోడ్డుపైనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాదాపు గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల భూములను కాపాడాలని విద్యార్థినిలు నినాదాలు చేశారు.
చివరకు ఉన్నతాధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడంతో ఇప్పుడైనా ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ధర్నాలు విరమించబోమని పట్టుబట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులతో మాట్లాడకపోవడంతో సంఘటన స్థలానికి నిజామాబాద్ సౌత్ సర్కిల్ సిఐ నరేష్ చేరుకుని విద్యార్థినిలను సముదాయించారు.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. కబ్జాకు గురైన జాగ విషయంలో ఫిర్యాదు కేసు నమోదు చేస్తామని ఉన్నతాధికారుల దృష్టికి సైతం సమస్యను తీసుకెళ్తామని చెప్పడంతో ధర్నాను విరమించుకున్నారు. కార్యక్రమంలో ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ భారతి రెడ్డి, అధ్యాపక బృందం నీరజ, చంద్రకళ, మేఘ సుబేదార్‌లతోపాటు భారీ సంఖ్యలో విద్యార్థినిలు పాల్గొన్నారు.