నిజామాబాద్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న మూడు డిఏలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన నిజామాబాద్ డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని, అంగీకరించిన అంశాల పైన తక్షణమే జీవోలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గురువారం స్థానిక నూతన అంబేద్కర్ భవన్ నందు జరగనున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు శిర్ప హనుమాన్లు, కార్యదర్శి అందే సాయిలు, కోశాధికారి రాధా కిషన్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ, ముత్తారం నరసింహస్వామి, భోజరావు, జస్వీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.