మోర్తాడ్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలంలో వివిధ గ్రామాలలో ఆరోగ్యానికి గురై ఆర్థిక సహాయం కొరకై రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డిని సంప్రదించి, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయాన్ని ఇప్పించవలసిందిగా కోరగా మంత్రి స్పందించి మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 18 లక్షల రూపాయలు మంత్రి ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించినట్లు మోర్తాడ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా తెలిపారు.
చెక్కులను మోర్తాడు మండల టిఆర్ఎస్ నాయకులు బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అడగగానే ఆర్థిక సాయం చేయించినందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మోర్తాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, జడ్పిటిసి బద్దం రవి, మోర్తాడ్ పిఎసియస్ చైర్మన్ కళ్లెం అశోక్ రెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.