ఆర్మూర్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఆలూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టలు బాధితులు, రుణమాఫీ జరగని రైతు బాధితులు, రైతు బీమా, రైతు బంధు, పోడు భూముల బాధితులతో కలిసి ధర్నా నిర్వహించి తహసీల్దార్ దత్తాత్రికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి వెబ్‌సైట్‌ను వెంటనే రద్దు చేయాలని, రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని అడవి భూములను పోడు భూములుగా చేయాలని, అలాగే అసైన్డ్ భూములకు పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షలు మంది కౌలు రైతులు ఉన్నారు, కాబట్టి వారికి కౌలు రైతు చట్టం కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ డేగ పోశెట్టి , కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీ దేగం ప్రమోద్, మాక్లూర్ మండలప్రెసిడెంట్ వేంకటేశ్వర్ రావ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముక్కెర విజయ్, మాజీ ఎంపిటిసి రమేష్, నీలగిరి శ్రీనివాస్, ఆర్మూర్ అసెంబ్లీ యూత్ సెక్రెటరీ తిరుమనపల్లి నవనీత్, కల్లడి కాంగ్రెస్ అధ్యక్షుడు పులమంటి ప్రకాష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉదయ్, జంగిడి శ్రీను షేక్ అభిబ్, కుంట నారాయణ, తరుణ్, బార్ల ముత్యం, తదితరులు పాల్గొన్నారు.