వర్ని, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం వర్ని మండల కేంద్రంలో రైతు రుణమాఫీ, పోడు భూములు, ధరణి సమస్యల గురించి ఎమ్మార్వో కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు వెంటనే రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని, ధరణి పోర్టల్ని వెంటనే రద్దు చేయాలని, పొడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలన్నారు.
రైతుబంధు, రైతు బీమా అర్హులైన రైతులందరికీ వర్తింపచేయాలని, రైతులు పండిరచిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, గిట్టుబాటు ధరను కల్పించాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీ పూర్ రాజారెడ్డి, డిసిసి కార్యదర్శి సురేష్ బాబా, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షుడు గంగప్ప, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డనేటర్ బోయుడి లక్ష్మణ్, నరెడ్ల సాయులు, ప్రకాష్ రావ్ బాబా, రెడ్డి రాంబాబు, సుధాకర్, సర్యా నాయక్, హన్మంత్రావ్, వెంకట్ గౌడ్, నాను వర్ని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.