సదాశివనగర్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో శుక్రవారం స్థానిక ఎం.పి.పి గైని అనసూయ, స్థానిక సర్పంచ్ లలిత, మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వర్ రావు, స్థానిక సింగల్ విండో చైర్మన్ టి గంగాధర్, గ్రామ ఉపసర్పంచ్ సాయిలు కలిసి 27 వేల చేప పిల్లలు వదిలారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో మత్స్యకారులు చెపపిల్లలు వేయడానికి ఆర్థికంగా వెనుకబడి చెరువులో చెపపిల్లలు వేయడానికి దళారులను అశ్రయించే వారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాదించి న తరువాత ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గంగ పుత్రులను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వ నిధులతో చేపపిల్లల పంపిణి కార్యక్రమం చేపట్టారన్నారు.
ఇంతే కాకుండా వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి వాహనాలు కూడ సమకుర్చారన్నారు. అన్ని కుల వృత్తులను కాపాడడానికి టి.ఆర్‌ఎస్. ప్రభుత్వ ము కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు గైనిరమేష్, గద్దల రవి, గంగాపుత్ర సంఘం నాయకులు రాంలు, కిషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.