ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం ఎర్రపాడు లోని పోలింగ్‌ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. జనవరి ఒకటి 2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటర్‌ నమోదు కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

బూతులెవల్‌ అధికారులతో మాట్లాడారు. మృతి చెందిన వారి పేర్లు తొలగించాలని తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆదివారం ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. అర్హత గల వారందరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »