రామకృష్ణ విద్యానికేతన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం

నిజామాబాద్‌, నవంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యానికేతన్‌లో న్యాయవాది పరిషత్‌ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దివాస్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీనియర్‌ న్యాయవాది బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ మాట్లాడుతూ ప్రత్యేక పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చట్టాలను గౌరవించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులు ప్రాథమిక బాధ్యతల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

అదేవిధంగా భారత గౌరవాన్ని పెంచే విధంగా పెంచే విధంగా ముందుకెళ్లాలని తెలిపారు. కొన్ని చట్టాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయాధిపరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌ గౌడ్‌, న్యాయవాది పిల్లి శ్రీకాంత్‌, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

24 మందికి గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా

Print 🖨 PDF 📄 eBook 📱 జగిత్యాల, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »