సదాశివనగర్ నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం సదాశివ నగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో భోజనశాల నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు. దీనికి ప్రముఖ శాస్త్రవేత్త, సామాజికవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తన సొంత డబ్బు సుమారు రూ. 4 లక్షలతో షెడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భూమి పూజ చేశారు.
ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు ఇటీవల ఎల్లారెడ్డి సందర్శనకు వచ్చినప్పుడు విద్యార్థులు ఎండలో కూర్చొని భోజనం చేయడం గమనించి చలించిపోయారు. స్వయంగా తానే భోజనశాల షెడ్డు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు స్థానిక నాయకులు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ డోకురి రామ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు వడ్ల రాజేందర్, అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, పద్మాజివాడి సొసైటీ చైర్మన్ గంగాధర్, వార్డ్ మెంబర్ శీను, కుమ్మరి రాజయ్య, గంగరాజు పాల్గొని దాత పైడి ఎల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.