కామారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం కలిశారు.
మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, దామరంచ సొసైటి చైర్మన్ కమలాకర్ రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ మాసాని శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అన్వర్, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎక్బాల్, మాజీ సర్పంచ్ గంగారాం, రెడ్డి రాంబాబు, గజ్జెల సాయులు, సంజీవ్ రెడ్డి, అమృత్, తులసిరామ్, హన్మగొండ, ముత్యాల కృష్ణా, పృథ్వి, రాజేశ్వర్, భూమ్ రెడ్డి కలిసి బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి చర్చించారు.
మధన్ మోహన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మీరు బాన్సువాడ మీద దృష్టి పెట్టాలని నాయకులు కోరారు. మధన్ మోహన్ మాట్లాడుతూ మీరు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఒక్క సంవత్సరం పార్టీ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రేవంత్ రెడ్డి నాయకత్వములో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్దాం అని నాయకులకు సూచించారు.