రెంజల్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆదివారం గుర్తించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మించడానికి స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఇల్లు లేని వారి జాబితాను తయారుచేసి ఇండ్లను కేటాయించడం జరుగుతుందని ఆర్డిఓ అన్నారు. కార్యక్రమంలో రైసస జిల్లా డైరెక్టర్ మౌలానా, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, రామాలయం చైర్మన్ అబ్బన్న, సాయరెడ్డి, హన్మంతరావు, క్రాంతి కుమార్, మధు తదితరులు ఉన్నారు.