నిజామాబాద్, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక విప్లవ కారులు, సంఘ సంస్కర్త, బడుగులకు విద్య ప్రదాత, బీసీల జాతి పిత మహాత్మ జ్యోతిబాపూలే 132వ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే కేవలం బడుగు బలహీనవర్గాలకె సేవ చేయలేదని, సమాజంలో వెనుకబడిన ప్రతి ఒక్కరి గురించి పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మ జ్యోతిబాపూలే అని పేర్కొన్నారు. అగ్రవర్ణాల పేదలకు, వితంతువుల కొరకు, ఎస్సీ ఎస్టీ, బిసి ఇలా ప్రతి జాతి కొరకు, ప్రతి కులం వారి కొరకు పోరాడిన ఏకైక వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు.
తన భార్యకు విద్యను నేర్పి భారత దేశ ప్రథమ ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన గొప్ప దార్శనికుడు మహాత్మ జ్యోతిబాపూలే అని, సమాజం బాగుపడాలంటే మహిళా చైతన్యం ముఖ్యమని, మహిళా చైతన్యం విద్యతోనే సాధ్యమని గ్రహించి ఆ విధంగా మహిళలకు విద్య నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు.
మహిళలు బాగు పాడితే కుటుంబం బాగు పడుతుందని చెప్పి తన భార్య ద్వారా మహిళలకు విద్య నేర్పిన విద్య ప్రదాత భారతదేశ ముద్దుబిడ్డ మహాత్మ జ్యోతిబాపూలే భారతదేశానికొక గొప్ప వరమన్నారు. కార్యక్రమంలో ధర్శనం దేవేందర్, పోల్కం గంగాకిషన్, కొయ్యాడ శంకర్, ఏగొండ స్వామి, సత్యనారాయణ, అనిల్, గోపి, బసవకుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.