నిజామాబాద్, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విధి నిర్వహణలో అటవీశాఖ అధికారులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు భరోసానిచ్చారు. ఖమ్మం జిల్లా ఫారెస్టు రేంజ్ అధికారిని హతమార్చిన సందర్భంగా సిపి భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ రావును గుత్తి కోయలు హత్య గావించిన నేపద్యంలో సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న నిజామాబాద్, వర్ని, కమ్మర్పల్లి, సిరికొండ, ఆర్మూర్ రేంజ్ పరిధిలోగల ఫారెస్టు సిబ్బంది అటవి ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. విధినిర్వహణలో ఎలాంటి హాని జరగకుండా పోలీస్ శాఖ వారి రక్షణ కోసం భరోసా కల్పిస్తామని సీపీ అన్నారు. ఎవరికి ఎలాంటి హాని జరుగకుండా పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని, ఎళ్లవేలల అటవీ శాఖ అధికారులకు తోడుగా ఉంటామని తెలిపారు.
ఎల్లప్పుడూ భద్రతా కల్పిస్తామని, అందుకుగాను నిజామాబాద్ అటవిశాఖకు పూర్తి స్థాయి భరోసా ఇస్తున్నామని సిపి నాగరాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటి పోలీస్ కమీషనర్ వి. అరవింద్ బాబు, జిల్లా అటవి శాఖ అధికారి వికాస్ మీనా, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఎ.సి.పిలు ఎ. వెంకటేశ్వర్, ఆర్. ప్రభాకర్ రావు, కె.ఎమ్. కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీశైలం, సి.ఐలు ఎస్.ఐలు, ఫారెస్టు డివిజినల్ అధికారులు, అటవి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.