ఫీ -రియంబర్స్‌ మెంట్‌ వెంటనే విడుదల చెయ్యాలి

ఆర్మూర్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పెండిరగ్‌ లో ఉన్న ఫీ -రియంబర్స్‌ మెంట్‌ను విడుదల చెయ్యాలని ఆర్మూర్‌ ఆర్‌.డి.వో ఎ.ఓ లతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్‌ రమావత్‌ లాల్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీ-రియంబర్స్‌ మెంట్‌ మొత్తాన్ని విడుదల చెయ్యక పోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఫీ-రియంబర్స్‌ మెంట్‌ విడుదల చెయ్యనందున రాని రియంబర్స్‌ మెంట్‌ మొత్తాన్ని ఫీజులుగా చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుపోవాలని ప్రైవేట్‌, ప్రభుత్వ కళాశాలలు విద్యార్థులను వేధిస్తున్నారని అన్నారు. విద్యార్థులను వేధిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని అలాగే పెండిరగ్‌లో ఉన్న ఫీ -రియంబర్స్‌ మెంట్‌ మొత్తాన్ని విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టివియువి మండల కన్వీనర్‌ ఆనంద్‌, కో- కన్వీనర్‌ మణి కంఠ, సహాయ కార్యదర్శి మదన్‌, రాహుల్‌, విశాల్‌, నితిన్‌ పాల్గొన్నారు.

Check Also

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »