నిజామాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శలకు అనుగుణంగా దత్తత తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దత్తత మాసం సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తతను ప్రభుత్వ పరంగానే తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం కాకుండా ఇతర ఏ మార్గంలో దత్తత చెల్లదని తెలిపారు. పిల్లల్ని దత్తత కావలసినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సీనియారిటి ప్రకారం పిల్లల్ని ఇస్తారని తెలిపారు. దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, నిజామాబాద్ ఆర్డిఓ బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, డిసిపిఓ చైతన్యకుమార్, శిశు గృహ సిబ్బంది పాల్గొన్నారు.