ఆర్మూర్, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అండగా నిలిచి వైద్య సహాయానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక తోడ్పాటునందించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన టీ. మహేందర్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని ఆశ్రయించారు. వెంటనే ఆయన సీఎంఆర్ఎఫ్ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువచ్చి రెండు లక్షల రూపాయల ఎల్వోసీని మంజూరు చేయించారు.
జీవన్ రెడ్డి బుధవారం ఎల్వోసీ చెక్కును అందజేశారు. మహేందర్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎల్వోసీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు , వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.