ఎల్లారెడ్డి, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన సదాశివనగర్ మండలం తుక్కోజి వాడి, కుప్రియాల్ గ్రామాలకు చెందిన 200 మంది ప్రజలు కలిసిన సందర్భంగా ఆయన పైవిధంగా అన్నారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, దాదాపు గంటసేపు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. తనకు ప్రచార ఆర్భాటం కంటే ప్రజా సమస్యలను పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు.
ప్రజలు తనను ఎంతో ఇష్టంతో గెలిపించారని వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం తన అదృష్టమన్నారు. గ్రామాల్లో ఏమైనా వైద్య సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని తప్పకుండా పార్టీలకతీతంగా వారికి సేవ చేస్తానన్నారు. ఇప్పటికే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడానికి నిధులు ఇవ్వడం జరిగిందని మరిన్ని నిధులు త్వరలోనే మంజూరు చేస్తానన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌కున్న తపన ఇతర పార్టీల నాయకులకు ఎందుకు ఉంటుందన్నారు, అందుకే ఆయన తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు. అధికారం కోసం మాయమాటలు చెప్పుకొని పబ్బం గడుపుతున్నారన్నారు.
నియోజకవర్గ ప్రజల రుణం తీసుకోవడానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి తప్పకుండా అభివృద్ధి సాధిస్తానని ఆయన వివరించారు. కార్యక్రమంలో సదాశినగర్ మండల రైతు బంధు అధ్యక్షుడు ఏలేటి భూమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, తుక్కోజి వాడి గ్రామ టిఆర్‌ఎస్ నాయకులు రమేష్ రావు, గంగాధర రావు, రాజు, గంగాధర్, కుప్పిరియాల్ గ్రామానికి చెందిన సాకలి బాలరాజ్, రిటైర్డ్ హెడ్మాస్టర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.