కామారెడ్డి, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ పరిధిలో ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులలో క్రీడ ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.