కామారెడ్డి, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనం పాటిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు.
సమావేశానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాటి మానవుల పట్ల ప్రజలు సోదర భావాన్ని చూపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి జీవనం కొనసాగించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నరేష్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.