డిచ్‌పల్లి, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉదయం నుండి తెలంగాణ యూనివర్సిటీ గ్రౌండ్‌లో కబడ్డీ (మహిళా, పురుషుల) జట్లను ఎంపికలు నిర్వహిస్తున్నామని వర్సిటీ క్రిడా విభాగం డైరెక్టర్ డాక్టర్ టి.సంపత్ తెలిపారు. సెలక్షన్స్ కొరకు నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ, పీజీ చదవుతున్న కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా విభాగంలో 16 కళాశాలల నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల విభాగం 14 కళాశాలల నుండి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు తెలిపారు.
సెలక్షన్‌ను వర్శిటీ ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ ఆరతి, వర్శిటీ కబడ్డీ జట్టు ఎంపికలో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి అభినందనలు తెలియజేస్తూ క్రీడలు వ్యక్తి యొక్క అల్ రౌండ్ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరు ప్రతి రోజు తమకు నచ్చిన ఆటలు ప్రాక్టీస్ చేయాలనీ, కబడ్డీ క్రిడా గ్రామీణ క్రిడా అని మన తెలంగాణ యూనివర్సిటీలో సెలక్షన్స్ నిర్వహించడం చాల అభినందనీయమన్నారు.
క్రిడా విభాగం ఇంకా అనేక క్రీడలను కూడా నిర్వహించాలని, మంచి క్రిడా కారులను యూనివర్సిటీ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరుతూ ఈ సెలక్షన్‌కి అనుమతించిన ఉపకులపతి ప్రో. డీ. రవీందర్‌కి, రిజిస్ట్రార్ ప్రో.బీ. విద్యావర్ధినికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పై సెలక్షన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నందుకు వర్శిటీ క్రీడా విభాగం సహాయ సిబ్బందిని అభినందించారు. సెలక్షన్‌లో జి.జి కళాశాల పీ .డీ బాలమణి, జిడీసి ఎల్లారెడ్డి స్పోర్ట్స్ ఇంచార్జి కృష్ణ ప్రసాద్, వెంకటేశం, స్వప్న, అశ్విని, వర్శిటీ సహాయ ఆచార్యులు డా .బీ .ఆర్ నేత, రమేష్, రాహుల్, యశ్వంత్ రాజు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.