కామారెడ్డి, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం మైనూర్ పంచాయతీ పరిధిలోని మోడల్ స్కూల్లో విద్యార్థిని కొట్టిన సంఘటనపై విద్యార్థులను బిఎల్‌ఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వడ్ల సాయికృష్ణ పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండలం మైనూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జ్యోతిని లెక్చరర్ మహేశ్వరి విద్యార్థులను, విద్యార్థిని జ్యోతిని మాటలకు చెప్పుకో రానివిధంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ నేను ప్రభుత్వ ఉద్యోగిని నన్ను ఏం చేయలేరు మీరేం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ విద్యార్థులను కొట్టడం జరిగిందని ‘‘బాధిత విద్యార్థిని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది ‘‘ఈ ఘటనకు కారణమైన లెక్చరర్ మహేశ్వరి, ప్రిన్సిపాల్ లావణ్యను సస్పెండ్ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లేనిపక్షంలో బహుజన లెఫ్ట్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వాసుదేవ్, పూజ, విజయలక్ష్మి, రోహిత్, సాయికిరణ్, సంగీత, నవదీప్, విద్యార్థులు పాల్గొన్నారు.