నిజామాబాద్, డిసెంబరు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఇద్దరు పిల్లల్ని దత్తత ఇవ్వడం జరిగింది. గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శిశు గృహలో వసతి పొందుతున్న ఆరు నెలల వయసు గల ఇద్దరు అమ్మాయిలను బెంగళూరు, విజయవాడకు చెందిన తల్లిదండ్రులకు దత్తత ఇచ్చారు.
పిల్లలు లేని వారు దత్తత తీసుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఈ సందర్భంగా తెలిపారు. దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులకు అభినందించారు. పిల్లలకి మంచి భవిష్యత్తు విద్య అందించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, బిఆర్బి కోఆర్డినేటర్ విజయలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సంపూర్ణ, సభ్యులు శోభారాణి, డిసిపిఓ చైతన్య కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.