కామారెడ్డి, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో టిఆర్‌ఎస్ యువజన విభాగం, విద్యార్థి విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్, టిఆర్‌ఎస్వి పట్టణ అధ్యక్షులు ముత్యం పృథ్విరాజ్ మాట్లాడారు.
మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా ఉద్యమ కెరటం తొలి అమరుడు శ్రీకాంతా చారి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసిన గొప్ప అమరుడు అని కొనియాడారు. అదే విధంగా శ్రీకాంతాచారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేంతవరకు విద్యార్థులు యువకులు అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని ఉధృతం చేసి అన్ని వర్గాలు ముందు వరుసలో ఉన్నాయన్నారు.
శ్రీకాంతాచారి కలలుగన్న సమసమాజ నిర్మాణం కోసం టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ నాయకత్వంలో కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ యువజన విభాగం విద్యార్థి విభాగం నాయకులు ప్రయత్నిస్తారని తెలిపారు. అమరుల త్యాగం ద్వారానే తెలంగాణ ఏర్పడిరది, అమరులు కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్ని అన్నారు.
దేశంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి వరసలో దూసుకుపోతున్న రాష్ట్రమేదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమని మరోసారి గుర్తు చేస్తారు. అమరుల ఆశయ సాధన కోసం కృషి చేసినటువంటి ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ పార్టీ అన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు దినేష్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి చరణ్, కోశాధికారి సాయి, కార్యవర్గ సభ్యులు మారుతీ, యువజన విభాగం నాయకులు కృష్ణ, శీను, శేఖర్ భరత్, టిఆర్‌ఎస్వి పట్టణ ఉపాధ్యక్షులు అశోక్, టిఆర్‌ఎస్ నాయకులు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.