వేములవాడ, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణకాశీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కోనేటిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ.
అయితే గత కరోనా కాలం నుండి ధర్మగుండం (కోనేరు)లో నీరు నింపకుండా, భక్తులకు అనుమతించడం లేదు. కాగా ఆదివారం, డిసెంబరు 4వ తేదీ ఉదయం 8 గంటలకు రాజన్న ఆలయ ధర్మ గుండం పున: ప్రారంభం చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి ధర్మగుండం ప్రారంభిస్తారు. ఇకనుండి భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి మొక్కులు తీర్చుకునే అవకాశం కలగనుంది.