మాయమాటలు నమ్మొద్దు

నిజామాబాద్‌, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కానిస్టేబుల్‌, ఎస్‌.ఐ ల ఎంపిక ప్రక్రియా పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు తెలిపారు. పోలీస్‌ నియమాకాలకు సంబంధించి ఈ నెల 8 నుండి 22 వరకు 12 రోజుల పాటు జరిగే దేహదారుఢ్య పరీక్షలు నిజామాబాద్‌ జిల్లా టౌన్‌ 5 పి.యస్‌ పరిధిలోని నాగారం వద్ద గల రాజారాం స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆదివారం సి.పి ఏర్పాట్లు పరిశీలించారు.

11 వేల 393 మందికి శరీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు నాగారం స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావులేకుండా శరీర దారుఢ్య పరీక్షలు జరిగే గ్రౌండ్‌ మొత్తం సి.సి కెమెరాల నిఘాలో ఉంచుతున్నామని సిపి వెల్లడిరచారు. అభ్యర్థి ఎత్తు కొలిచేందుకు డిజిటల్‌ మీటర్లు ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల పరుగు, మహిళలకు 800 మీటర్ల పరుగు ఆర్‌.ఎఫ్‌.ఐ.డీ ప్యాడ్లను ఉపయోగిస్తున్నామని అన్నారు.

ప్రతి అభ్యర్థికి రిస్టు బ్యాండ్‌ అమర్చడం జరుగుతుంది. అభ్యర్థి గ్రౌండ్‌ సి.సి కెమెరాల నిఘాలో ఉంటారని, అభ్యర్ధి రిస్టు బ్యాండ్‌ చేతి నుండి తీసివేయడంగాని లేదా డ్యామేజ్‌ చేయడం చేయడకూడదని, అలా చేసినట్లయితే అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందని సిపి స్పష్టం చేశారు. ఆర్‌.ఎఫ్‌.ఐ డి ప్యాడ్‌ అభ్యర్థికి తగిలించడం వల్ల ఎంత సమయంలో గమ్యం చేరారన్నది ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా ఆటోమోటిక్‌ గా రికార్డు నమోదు అవుతుందని అన్నారు.

షార్టూట్‌, లాంగ్‌ జంప్‌ కోసం డిజిటల్‌ థియోడలైట్స్‌ ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. దీంతో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి బోర్డ్‌ సర్వర్‌ లో అప్లోడ్‌ అవుతుందన్నారు. మహిళా అభ్యర్థుల ఇబ్బందులను అధిగమించేందుకు ఈ సారి మహిళా అభ్యర్థులకు ప్రత్యేక రోజుల్లో బ్యాచులను కేటాయించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 8న ప్రారంభమయ్యే రెండో దశ పోలీస్‌ ఎంపిక ప్రక్రియ 20 తేదీ నాటికి పూర్తి అవుతుందని అన్నారు.

ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అందరి సమక్షంలో ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 11,393 మంది అభ్యర్థులు దేహాదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారని, ఇందులో 9025 మంది పురుషులు, 2327 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారని సిపి వెల్లడిరచారు. ప్రతి రోజు 600 నుంచి 1000 మంది వరకు అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఉదయం 5గంటలకు పరీక్ష ప్రారంభమౌతుందని, ఇందులో ఉత్తీర్ణులైన వారు తదుపరి తుది రాత పరీక్షకు ఎంపికవుతారని వివరించారు.

మైదానంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, సర్టిఫికేటు పరిశీలన నుంచి దేహాదారుఢ్య పరీక్షల వరకూ వినూత్న రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహించనున్నట్టు సిపి అన్నారు.

మాయమాటలు నమ్మొద్దు :
పోలీస్‌ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతుందని, ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీకు ఉద్యోగం వచ్చేవిధంగా సహాయం చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని సిపి నాగరాజు కోరారు.

ప్రతీ అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుందని, ఎక్కడా మానవ ప్రమేయం ఉండదని, ప్రతీబ్యాచ్‌ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతీ అంశం సి.సి కెమెరాల్లో రికార్డు అవుతుందని, దాన్ని భద్రపరుస్తామని, భవిష్యత్తులో ఏవైనా విమర్శలు వస్తే సి.సి పుటేజీ ఆధారంగా విచారణ చేపడతారని అన్నారు. వేలిముద్రలు తీసుకున్నతర్వాతనే అభ్యర్థుల్ని గ్రౌండ్లోకి అనుమతిస్తారని, అభ్యర్థులు తమ ఫోన్లు, ఇతరవస్తువులు తీసుకురావద్దని, వాటిని భద్రపరి చేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండవని సిపి తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »