భిక్కనూరు, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాచాపూర్ గ్రామ శివారులో గల ఎంఎస్‌ఎన్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాల ద్వారా చెరువులో చేపలు, తాబేళ్లు చనిపోవడం జరుగుతుందని, కంపెనీ ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాల వలన భూమి కలుషితమైందని, గాలి, నీరు కలుషితం అవుతుందని రిటైర్డ్ ఆర్మీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్‌రెడ్డి, మండల బీఎస్పీ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, గంగపుత్రుల సంఘం కార్యదర్శి పుస నర్సింలు, గ్రామ విడిసి ఛైర్మన్ మహిపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం భిక్కనూరు మండల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కంపెనీ నుండి వచ్చే వ్యర్థాల ద్వారా కొన్ని సంవత్సరాల క్రితం భూమి మొత్తం కలుషితమై ప్రజలు రోగాల బారిన పడతారని అందుకని వెంటనే ఎంఎస్‌ఎన్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు కాచాపూర్ గ్రామంలో మాట్లాడడం జరిగిందని, ఇప్పుడు భిక్కనూర్ మండల ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు.
ఆ తర్వాత మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఎంఎస్‌ఎన్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాల గురించి తెలియజేసి కంపెనీ మూసివేసేంతవరకు మండలంలోని అన్ని పార్టీలకు అతీతంగా బిక్కనూర్ మండల ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. కంపెనీ నుండి వచ్చే వ్యర్థపదార్థాలను ల్యాబ్‌కు పంపితే ఇప్పుడే 23 పర్సంటేజ్ కలుషితమైందని రిపోర్ట్ కూడా వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ రైతు ఉపాధ్యక్షులు తిరుపతి గౌడ్, మూడు గ్రామాల ఎంపిటిసి మోహన్ రెడ్డి, బీఎస్పీ పార్టీ శ్రీధర్ రెడ్డి, కాచాపూర్ గంగాపుత్ర సంఘం నాయకులు, కాచపూర్ గ్రామ యువజన నాయకులు, భిక్కనూరు మండల వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.