Breaking News

    18న టి.యు.డబ్ల్యూ.జే (ఐ.జే.యు) మహాసభ

    నిజామాబాద్‌, డిసెంబరు 4

    నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి.యు.డబ్ల్యు.జే (ఐ.జే.యు) మహాసభను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నరసయ్య అదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని టి.యు.డబ్ల్యూ.జే (ఐ జే యు) సభ్యులంతా మహాసభకు సిద్ధం కావాలని, ప్రతి ఒకరు 18న జరిగే సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

    ఈ మహాసభను నిజామాబాద్‌ నగరంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే మహాసభ అనంతరం టి.యు.డబ్ల్యూ.జే (ఐజేయు) జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సైతం సభ్యులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు నంగునూరు శేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరహాత్‌ అలీ హాజరవుతున్నారని తెలిపారు.

    Check Also

    నేటి పంచాంగం

    Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »