ఆర్మూర్, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్‌లో మంగళవారం పెన్షన్ పంపిణీ సరళిని ఏఎస్పీ వై.సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేసారు. అదేసమయంలో అక్కడున్న ప్రజలకు, పెన్షన్ దారులను ఉద్ధేశించి పోస్టల్ శాఖలో ఏలాంటి స్కీమ్స్‌తో సర్విస్ అందిస్తున్నామనే విషయమై వివరించారు.
ఎస్బీ, ఆర్డీ, టీడీ, ఎస్‌ఎస్‌ఏ అకౌంట్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, జీవన్ ప్రమాన్ సర్టీఫికెట్స్, ఐపీపీబి బ్యాంక్ సేవలు, ఆధార్ సర్వీసెస్, డిజిటల్ చెల్లింపులు, సులభంగా ఏవిధంగా ఓపెన్ చేయవచ్చు అని అక్కడున్న ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి అవగాహన కలిగించారు. స్కీములు ప్రతీ గ్రామంలోని బ్రాంచ్ పోస్టాఫీసులలో తమ బీపీఎంలు ఇంటింటికి తిరిగి సర్వీసును అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మానిటరింగ్ ఆఫీసర్ దశరథ్, జిరాయత్ నగర్ సబ్ పోస్టాఫీస్ ఎస్పీఎం ఆంజనేయులు, బీపీఎంలు, ఏబీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.