కామారెడ్డి, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లా నూతన కార్యాలయాలు ప్రారంభోత్సవానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకి గత ఎన్నికల సమయంలో కామారెడ్డి పట్టణానికి వచ్చేసి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూన్నామని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ అన్నారు.
ఈ మేరకు మంగళవారం షబ్బీర్ అలీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రెండున్నర సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్ పల్లె బాట, పట్టణ బాట పట్టడాన్ని స్వాగతిస్తున్నామని,
మూడు సంవత్సరాలుగా సచివాలయంకు రాకుండా ప్రజలకు కలవని ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ చరిత్రకెక్కారన్నారు.
రామాయణంలో కుంభకర్ణుడి లా కెసిఆర్ వ్యవహరిస్తున్నాడని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు నిధులు, నియామకాలు, అభివృద్ధి లేకుండా సీఎం కేసీఆర్ చేశాడన్నారు.
సీఎం కేసీఆర్ మూడు లక్షల కోట్ల అప్పు చేశాడని, తెలంగాణను అభివృద్ధి చేయడం పూర్తిగా సీఎం కేసీఆర్ మర్చిపోయాడని, పక్క రాష్ట్రాల వాళ్లు కృష్ణాజలాల వాడుకుంటే చూస్తూ సీఎం కేసీఆర్ ఊరుకున్నాడని ధ్వజమెత్తారు.
2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజ్ 21.22.23. కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కాలేశ్వరం మార్చాడని, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ మాట తప్పాడన్నారు.
200 కోట్లు ఇస్తే కాలేశ్వరం పనులు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, వెంటనే 200 కోట్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి ని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని సీఎం కేసీఆర్ మాట తప్పారన్నారు.
ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, కామారెడ్డి జిల్లాకి మెడికల్ కళాశాల ఇస్తామని మొండిచేయి చూపించారని, కామారెడ్డి పర్యటనలో భాగంగా కామారెడ్డి కి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ తో పాటు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి పట్టణంలో జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని కోరారు. అలాగే దోమకొండ కు వెంటనే డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల విషయంలో పాత వాటితొ పాటు అర్హులైన కొత్త వారికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూముల విక్రయానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం అని, అమ్మితే అడ్డుకుంటాం అని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నది సరిపోక కొత్తగా ఇప్పుడు తెలంగాణ భూములు అమ్ముకొని దోచుకుందామని చూస్తున్నారన్నారు.
విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.