పడగల్‌లో ఆర్మూర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అవగాహన సదస్సు

వేల్పూర్‌, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామం ప్రజాభవన్‌లో ఆర్మూర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారు గ్రామస్తులతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్‌ రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ అన్ని రకాల రుణాలు ఇస్తామని తెలిపారు.

కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శంకర్‌ మొహలే, వ్యవసాయ అధికారిని కరుణశ్రీ, బ్యాంక్‌ అధికారి ప్రియాంక పాల్గొన్నారు. వ్యవసాయ, వ్యాపారం, బంగారం, విద్య, వాహన, ఇల్లు కట్టుకోవడం కొరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.

అనంతరం బ్యాంకు అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో మీసాల శ్యామ్‌ రావు, ప్రసాద్‌, బడకల రాజేందర్‌, మల్కయ్య, ముత్తెన్న, రవీందర్‌ యాదవ్‌, రాగి ప్రభాకర్‌, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »