నసురుల్లాబాద్‌లో సైబర్‌ నేరాలపై అవగాహన

నసురుల్లాబాద్‌, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల పరిధిలోని, బొమ్మందేవ్‌ పల్లి ఎక్స్‌ రోడ్‌ నెమిలి, సాయిబాబా ఆలయం, వద్ద శుక్రవారం రోజు, ఎఎస్‌ఐ అభిబ్‌ బేగ్‌ సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎఎస్‌ఐ మాట్లాడుతూ సైబర్‌ నేరగలనుంచి జాగ్రత్తగా ఉండాలని, అనుమాన కాల్స్‌ వస్తే, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని, వారు మీకు ఫోన్‌ చేసి ఫోన్‌ నెంబర్‌ గాని, ఆధార్‌ నెంబర్‌ గాని అడిగితే చెప్పకూడదని, వారు మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని అంటారు, అలాంటప్పుడు అనుమానం వస్తే, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు వివరించారు. అవగాహన కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »