కామారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేకు కట్‌ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తున్న తరుణంలో సోనియా గాంధీ స్పందించి, ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటులో డిక్లేర్‌ చేయడం జరిగిందన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మన తెలంగాణ ప్రజలు ఎంత చేసిన ఆమె రుణాన్ని తీర్చుకోలేమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొంతమంది స్వార్థపరులు ప్రజల శ్రేయస్సును విస్మరించి, వారి సొంత లబ్ధి కోసము పాటుపడుతున్నారన్నారు. కనుక రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి సోనియాగాంధీ రుణాన్ని తీర్చుకుందామని అన్నారు.

కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు పండ్లరాజు, గుడుగుల శ్రీనివాస్‌, కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు ఐరన్‌ సందీప్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కారంగుల, అశోక్‌ రెడ్డి, కామారెడ్డి పట్టణ మైనార్టీ సెల్‌ అధ్యక్షులు సిరాజుద్దీన్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్లు గోనె శ్రీనివాస్‌, జొన్నల నరసింహులు, బట్టు మోహన్‌, పాక రవి ప్రసాద్‌, అడ్లూరు భూమన్న, శంకర్‌, మునీర్‌, కాకర్ల శేఖర్‌, హోసన్న, లక్కపతిని గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »